తెలంగాణ వ్యవసాయ పదాలు అర్థాలు || Telangana Telugu Words Meanings || TSTET || TET TELUGU GRAMMAR

            తెలంగాణ తెలుగు పదాలు - అర్థాలు


తెలంగాణ తెలుగు పదాలు అర్థాలు 👇👇

 1)వ్యవసాయం - ఎవుసం

2) యాసంగి - రబీ పంట

3) ఖరీఫ్ - వర్షా కాలం పంట

4) తరి - సాగు భూమి ( వెట్ )

5) ఖుష్కీ - డ్రై ( మెట్ట ప్రాంతం)

6) తైబందీ - రెండో పంట

7) గెట్టు - పొలం హద్దులు

8) మొగులు - ఆకాశం మబ్బులు పట్టడం

9) అరక - నాగలి

10) పొక్కు/పార - మట్టి తీసేది

11) గరిశె - వడ్లు నిల్వ చేసేది

12) అంగ - అడుగు

13) అగ్గువ - రేటు తక్కువ లేదా చౌక అయినది

14) ప్రియం - రేటు ఎక్కువ

15) జడ్డిగం - జొన్న సాలులో విత్తనాలు నాటేందుకు నాగలికి కట్టేది


16) కాణి - రెండు ఎడ్ల మెడల వేసే చెక్క కొయ్

17 ) కౌల్దార్ - భూమిని కౌలుకి తీసుకునేవాడు

18) ముల్లుగర్ర - దాదాపు నాలుగైదు మూరలు ఉండే పొడవాటి కర్ర. దీనికి చివర ఇనుప మొల (మేకు) ఉంటుంది. ఎడ్లను అదిలించడానికి ఉపయోగిస్తారు.

19) వడిశెల - పొలాల్లో పిట్టలు రాకుండా తాడులో రాయి ఉంచి విసిరేది

20) కొట్టం - పశువులను ఉంచేది

21) అల్పటి - దాపటి = ఎడమ, కుడి (సాధారణంగా బండికి కట్టే ఎడ్లను ఉదహరిస్తారు )

22) శేర్ దార్ - పెద్ద జీతగాడు

23) కమతం - భూమి విస్తీర్ణం

24) ఫౌతి - చనిపోయిన వారి వివరాలు నమోద

25) ఇలాకా - ప్రాంతం

26) తూము - చెరువుల నుంచి కాలువలకు నీటిని వదిలేది

27) మత్తడి - చెరువు నిండిన తర్వాత బయటకు వచ్చే నీరు

28) అలుగు - మత్తడి నుంచి పైకి వచ్చే నీరు

29) మడువ - చిన్న కాలువ నుంచి పొలాల్లోకి నీటిని వదిలేది


30) మాల్గుజారీ - భూమిశిస్తు వసూళ్ళు


31) పోరంబోకు - సాగుకు పనికిరాని భూమి

32) బంచరాయి - పశువుల ఆహారం కోసం వదిలిన ప్రభుత్వ భూమి

33) ఇనాం - ప్రభుత్వం సేవలు గుర్తించి ఇచ్చే భూమి

34) వేవళ్ ఇనాం - దేవుడి గుడిలో ధూప దీప నైవేద్యాలు చేసేందుకు ఇచ్చేది

35) బలోతా ఇనాం - భూమిలేని నిరుపేదలైన దళిత వర్గాలకు ఇచ్చేది (ఈ భూమిని అమ్మకూడదు, కొనకూడదు)

36) సర్ఫేఖాస్ - నిజాం నవాబు సొంత భూమి

37) సీలింగ్ - భూ గరిష్ట పరిమితి

38) ఏక్ ఫసల్ - ఒక పంట

39) రెవెన్యూ ఫిర్కా - ఒక నిర్ధేశిత రెవెన్యూ ప్రాతం

40) గిర్దావర్ హల్కా - నిర్దేశిత మండల ప్రాంతం

41) ట్రెజరీ - రాష్ట్ర ఖజానా

42) టంకశాల - నాణేలు ముద్రించే కేంద్రం

43) అర్జీ - దరఖాస్తు

44) శిస్తు - ట్యాక్స్

45) ఫసలీ - ఉర్దూ కేలండర్ సంవత్సరం (ఇది క్రీస్తుకు 590 సంవత్సరాల తర్వాత ఏర్పడింది. ఇప్పటికీ రెవెన్యూలో ఏడాదికేడాది ఫసలీ సంవత్సరాన్ని గుర్తిస్తారు )


46) పుల్లర - ప్రభుత్వ భూముల్లో పశువులను మేపితే చెల్లించాల్సిన పన్ను (ఫారెస్ట్ వాళ్ళకి ఉండేది)

47) సర్వే నెంబర్ - భూములను గుర్తించే నెంబర్

48) అడంగల్ - పహణీ

49) పావుతీ - రశీదు పుస్తకం

50) నక్షా - భూముల వివరాలు తెలిపే చిత్ర పటం (మ్యాప్ )

51) కబ్జాదార్ - భూమిని తన ఆధీనంలో ఉంచుకొని అనుభవించే వ్యక్తి

52) చౌఫస్లా - రైతుకి గ్రామంలో వేర్వేరు పంట భూములుంటే వాటిని ఒకే దగ్గర రాసే పుస్తకం ( రెవెన్యూ లెక్కల్లో గ్రామ లెక్క నెంబర్.4)

53) పైసల్ పట్టీ - భూమికి శిస్తు నిర్ణయించిన పుస్తకం

54) గోష్వారా - భూముల స్వభావం బట్టి పన్ను వసూలు కోసం, రైతుల పట్టా మార్పు వివరాలు నమోదు చేసే రిజిష్టర్

55) సేత్వార్ - సర్వే సెటిల్మెంట్ రిజిష్టర్ ( చివరిసారిగా 1964లో)

56) పాస్ బుక్ - రైతుకి భూమిపై యాజమాన్య హక్కులు గుర్తిస్తూ నమోదు చేసే పుస్తకం

( ROR కింద రెవెన్యూ శాఖ రిజిస్టర్లలో నమోదు చేయించుకున్న వారికి వీటిని ఇస్తారు )

57) గెజిట్ - రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించే అధికారిక పత్రం

58) చలానా - ప్రభుత్వానికి చెల్లించేందుకు ఉపయోగించే ఫాం

59) ఖాస్రా పహణీ - 1954-55 సెటిల్ మెంట్ తర్వాత జారీ అయిన భూమి హక్కుల రికార్డు

60) జమాబందీ - ఏడాదికి ఒకసారి భూమి శిస్తు ఆదాయ వ్యయాలను లెక్కపెట్టేది


61) తాలూక్ దార్ - జిల్లా కలెక్టర్

62) తహసిల్దార్ - మండల రెవెన్యూ అధికారి ( MRO)

63) నాయబ్ సాబ్ - డిప్యూటీ తహసిల్దార్

64) గిర్దావర్ - రెవెన్యూ ఇన్సెపెక్టర్ ( RI)

65) పటేల్ - గ్రామాధికారి ( VRO )

66) పట్వారీ - ప్రభుత్వం తరపున గ్రామంలో భూమి కొలతలు, పట్టాలు, శిస్తు రికార్డులు నిర్వహించే వ్యక్తి (కరణం )

67) మాలీ పటేల్ - గ్రామంలో రెవెన్యూ శిస్తులు వసూలు చేసేవారు

68) పోలీస్ పటేల్ - గ్రామంలో లా అండ్ ఆర్డర్ చూసేవారు

69) షేక్ సింధీ - సుంకరి, ఎలోడు ( రెవెన్యూ అసిస్టెంట్ - VRA)

70) నీరడి - గ్రామంలో సాగునీటిని విడుదల చేయడం, చెరువులు, ఇతర కాలువల నీటి యాజమాన్యం నిర్వహించేవాడు

71) పట్టాదారు - భూమి మీద యాజమాన్య హక్కుల కలవాడు

72) ఖాస్తు దారు- భూమిని అనుభవించే వారు


TET TRT కోసం PREPERATION లో ఉన్నవారు ఈ WHATS APP గ్రూప్ లో జాయిన్ కావచ్చు👇👇

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/KJdfOvFc6KX8UVaNJ3cQVp


Telegram group 👇👇

https://t.me/+2Dq7BjHy58k4ZDBl